ఎయిర్‌పోర్ట్‌లో షారూక్ ఖాన్‌కి చేదు అనుభవం.. 2011 నాటి సీన్ రిపీట్!
By Ramya
November 15, 2022
Cover.Metalnation.org
బాలీవుడ్ సీనియర్ హీరో షారూక్ ఖాన్ (Shah Rukh Khan)కి 11 ఏళ్ల తర్వాత మళ్లీ ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.
Cover.Metalnation.org
దుబాయ్‌లో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కి హాజరైన షారూక్ ఖాన్ ఈరోజు ముంబయికి చేరుకున్నారు. కానీ.. విమానాశ్రయంలో షారూక్‌ని అడ్డుకున్న కస్టమ్స్ అధికారులు..
Cover.Metalnation.org
దుబాయ్‌లో బుక్ ఫెయిర్ ముగిసిన తర్వాత అక్కడ షాపింగ్ చేసిన షారూక్ ఖాన్.. రూ.18 లక్షల విలువైన లగ్జరీ వాచీలను కొనుగోలు చేశాడు.
Cover.Metalnation.org
వాటిని తీసుకుని ముంబయి విమానాశ్రయంలో దిగగా.. అతని లగేజీని చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఆ వాచీలపై ఆరా తీశారు.
Cover.Metalnation.org
ఈ క్రమంలో చాలా సేపు షారూక్ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. చివరికి ఆ రూ.18 లక్షల విలువైన వాచీలకి గానూ రూ.6.83 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత షారూక్‌ని విమానాశ్రయం వెలుపలికి అధికారులు అనుమతించారు.
Cover.Metalnation.org
2011లో కూడా ఇలానే విమానాశ్రయంలో కస్టమ్ అధికారులకి షారూక్ దొరికాడు. అప్పట్లో అతను ఏకంగా రూ.1.5 కోట్లని కస్టమ్స్ డ్యూటీ కింద కట్టాల్సి వచ్చింది.
Cover.Metalnation.org
షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కాబోతోంది.
Cover.Metalnation.org
ఈ సినిమాలో షారూక్‌కి జంటగా దీపికా పదుకొణె నటించింది. అలానే జాన్ అబ్రహాం కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.
Cover.Metalnation.org