షారుక్ ఖాన్ ‘పఠాన్’ టీజర్ విడుదల.. క్షణాల్లో పని మొదలెట్టిన ‘బాయ్‌కాట్’ బ్యాచ్! 

By Ramya

November 15, 2022

Cover.Metalnation.org

సుమారు నాలుగేళ్ల విరామం తరవాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పూర్తిస్థాయిలో నటించిన చిత్రం ‘పఠాన్’. నేడు షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ‘పఠాన్’ టీజర్‌ను విడుదల చేశారు. 

Cover.Metalnation.org

ఈ టీజర్ చూస్తుంటే ఇండియన్ సినిమాలో మరో యాక్షన్ ఎడ్వంచర్ చూడబోతున్నామని అర్థమవుతోంది. షారుఖ్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొనె, జాన్ అబ్రహం సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. 

Cover.Metalnation.org

ఈ సినిమా టీజర్ విడుదలైన కాసేపటికే కొంత మంది పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Cover.Metalnation.org

ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాలపై బాయ్‌కాట్ బ్యాచ్ ద్వేషాన్ని చిమ్ముతున్నారు. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా విడుదల సమయంలోనూ బాయ్‌కాట్ బ్యాచ్ రెచ్చిపోయారు. 

Cover.Metalnation.org

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, మరో కండల వీరుడు జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘పఠాన్’. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తోన్న 50 సినిమా ఇది. 

Cover.Metalnation.org

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాత. విశాల్, శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతోన్న ‘పఠాన్’పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. 

Cover.Metalnation.org

నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘పఠాన్’ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోంది. అయితే, టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో నెగిటివిటీ మొదలైపోయింది. 

Cover.Metalnation.org

ఈ సినిమా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’కు కాపీలా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మార్వెల్ సినిమాలను కాపీ కొడుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  

Cover.Metalnation.org

ఇక కొంత మంది ప్రభాస్ అభిమానులైతే ‘సాహో’లో కొన్ని సన్నివేశాలను ‘పఠాన్’లోని సీన్స్‌తో పోల్చి చూస్తున్నారు. ఇక్కడ వరకు ఒక మాదిరిగా ఉన్నా.. ‘బాయ్‌కాట్’ నినాదాన్ని కొంత మంది తీసుకురావడం దురదృష్టకరం. 

Cover.Metalnation.org

‘పఠాన్’ టీజర్‌ను షారుఖ్ ఖాన్, యశ్ రాజ్ ఫిలింస్ ట్విట్టర్‌ ద్వారా ప్రేక్షకులతో పంచుకోగా.. ఆ ట్వీట్‌కు ‘బాయ్‌కాట్’, ‘బాయ్‌కాట్ బాలీవుడ్’, ‘బాయ్‌కాట్ పఠాన్’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. 

Cover.Metalnation.org