ఓసారి ఎంపీ, రాజీవ్ గాంధీతో స్నేహం.. ఎన్టీఆర్‌తో పోటా పోటీ.. రాజకీయాల్లోనూ 'సూపర్ స్టారే'

by anitha 

15-11-22

Cover.Metalnation.org

సూపర్ స్టార్ కృష్ణ.. సీనియ‌ర్ నటుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు.

Cover.Metalnation.org

రాజకీయాల్లో తక్కువ కాలమే ఉన్నా సరే.. అక్కడ కూడా తనదైన ముద్రవేశారు.. ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. 

Cover.Metalnation.org

కృష్ణ 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాతే సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Cover.Metalnation.org

టీడీపీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు అనే సినిమా తీశారు. 

Cover.Metalnation.org

ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు. అప్పుడే రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణల మధ్య స్నేహం కుదిరింది. 

Cover.Metalnation.org

హస్తం పార్టీ కృష్ణను ప్రోత్సహించింది. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకమని అప్పట్లో చర్చ జరిగింది. అప్పుడే నేరుగా ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Cover.Metalnation.org

1989లో ఏలూరు నుంచి ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.మొదటి నుంచి చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

Cover.Metalnation.org