షూటింగ్‌లో సొమ్మసిల్లి ప‌డిపోయిన నాగశౌర్య‌..

By priyanka

November 14, 2022

Cover.Metalnation.org

యువ క‌థానాయ‌కుడు నాగశౌర్య షూటింగ్ చేస్తుండ‌గా క‌ళ్లు తిరిగిప‌డిపోయారు.  

Cover.Metalnation.org

సొమ్మసిల్లిన ఆయ‌న్ని హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు.

Cover.Metalnation.org

అస‌లు ఉన్న‌ట్లుండి ఆయ‌నెందుకు సొమ్మ‌సిల్లి ప‌డిపోయార‌నే దానిపై ముందు అంద‌రూ కాస్త కంగారు ప‌డ్డారు. 

Cover.Metalnation.org

అయితే అందుకు ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమీ లేదు. ఆయ‌న షూటింగ్‌లో భాగంగా కొన్ని గంట‌ల పాటు ఆహారంతో పాటు నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నార‌ట‌.  

Cover.Metalnation.org

దీంతో ఆయ‌న‌కు నీర‌సం వ‌చ్చి ప‌డిపోయార‌ని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం 

Cover.Metalnation.org

రీసెంట్‌గానే నాగ‌శౌర్య త‌న 24వ చిత్రాన్ని ప్రారంభించారాఉ. ఎస్‌.ఎస్‌.అరుణాచ‌లం ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా ప్రారంభ‌మైంది. 

Cover.Metalnation.org

ఆ సినిమా షూటింగ్‌లోనే నాగ‌శౌర్య పాల్గొంటున్నారు. 

Cover.Metalnation.org

శ్రీనివాస‌రావు చింత‌ల‌పూడి, డా.అశోక్ కుమార్ చింత‌ల‌పూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ అద్వైత‌, భ‌విష్య సినిమాకు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

Cover.Metalnation.org

ఈ నెల 20నే నాగ‌శౌర్య పెళ్లి చేసుకోబోతున్నారు.  

Cover.Metalnation.org

రీసెంట్‌గాఆయ‌న పెళ్లి తేదిని ఖరారు చేస్తూ అనౌన్స్‌మెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

Cover.Metalnation.org

బెంగుళూరుకి చెందిన ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అనూష శెట్టిని పెళ్లి చేసుకోబోతున్నారు. బెంగుళూరులోనే పెళ్లి జ‌ర‌గ‌నుంది. 

Cover.Metalnation.org