నేనేం ఓడిపోలేదు.. టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి బాలాదిత్య ఓపినియ‌న్‌ 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 రాను రాను రసవత్తరంగా మారుతుంది. ఈ వారం అంద‌రూ ఊహించిన‌ట్టే బాలాదిత్య బిగ్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు

Cover.Metalnation.org

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలో ఎలా ఉన్నాడో.. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా అంతే మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశాడు. ఇక స్టేజ్‌పై వచ్చిన‌ప్పుడు స‌భ్యులంద‌రితోనూ చ‌క్క‌గా మాట్లాడాడు.

Cover.Metalnation.org

ఒక్కొక్క‌రి ప్ల‌స్‌లు, మైన‌స్‌లు గురించి చెప్ప‌ట‌మే కాకుండా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకోవాల‌ని చెప్పాడు బాలాదిత్య‌. ఇక ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర కూడా వాతావ‌ర‌ణం కోలాహ‌లంగా మారింది. 

Cover.Metalnation.org

ఆయ‌న ఫ్యామిలీ స‌భ్యులంద‌రూ ఎమోష‌న‌ల్‌గా క‌లుసున్నారు. ఈ స‌మ‌యంలో బాలాదిత్య త‌న స్నేహితులను, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఒక్కొక్క‌రినీ ప‌రిచ‌యం చేశాడు.

Cover.Metalnation.org

బాలాదిత్య మాట్లాడుతూ ‘‘10 వారాల ప్రయాణం అంత సులభమేమీ కాదు. నన్ను అర్థం చేసుకుని అందరూ ఎంతో బాగా స‌పోర్ట్ అందిస్తూ వ‌చ్చారు. హౌస్ నుంచి తొలిగి ఉండొచ్చు కానీ.. నేనేం ఓడిపోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌కి థాంక్స్‌.

Cover.Metalnation.org

టాప్ 5లో ఎవ‌రుంటార‌నే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేను. ఎందుకంటే నేనూ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాన‌ని అస్స‌లు అనుకోలేదు. టాప్‌5లోకి ఎవ‌రు వెళ‌తార‌నే దానిపై చాలా ఫ్యాక్ట‌ర్స్ ఆధార‌ప‌డి ఉంటాయి.

Cover.Metalnation.org

మా ఇంట్లో ఎలా ఉన్నానో, ఆ బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఉన్నాను. సూర్య మోస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ది హౌస్‌గా చెప్పొచ్చు. ఎలిమినేట్ కావ‌టానికి నేను కార‌ణాల‌ను చెప్ప‌లేను.

Cover.Metalnation.org

గ‌త వారం గీతు బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ప్పుడు చాలా బాధ‌గా అనిపించింది. నేను అంద‌రికీ మంచివాడిగా క‌న‌ప‌డి ప్రేక్ష‌కుల‌కు క‌నిపించానంటే మా త‌ల్లిదండ్రులు, అన్న‌య్య‌, వ‌దిన, స్నేహితులు కార‌ణం.  

Cover.Metalnation.org

గెలుపు ఓట‌ములు మ‌న చేతిలో లేవు. నా వంతు బాధ్య‌త‌ను నేను చేశాను. సిగ‌రెట్స్ నా ఎమోష‌న్ కాదు.. ఈ విష‌యాన్ని నేను చాలా సంద‌ర్భాల్లో చెప్పాను’’ అన్నారు.

Cover.Metalnation.org