జుట్టు నిర్జీవంగా మారిందా..? గంజితో పట్టులా మెరిపించండి..! 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

ఈ కాలంలో చర్మం, జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా.. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం, చుండ్రు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. 

Cover.Metalnation.org

మీ కురులు పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతాయి. మీ ఇంట్లో సులభంగా దొరికే.. గంజి, బియ్యం కడిగిన నీళ్లతో మీ జుట్టును సిల్కీగా, షైనీగా‌ మార్చుకోవచ్చు.

Cover.Metalnation.org

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా దూరం అవుతాయి. గంజిలో బి, ఇ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణనిచ్చి హెల్తీగా మారుస్తాయి

Cover.Metalnation.org

ఒకప్పుడు గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడేవారు. గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. గంజిలోని అమైనో యాసిడ్స్‌ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి

Cover.Metalnation.org

గంజి చాలా బాగా ఉపయోగపడుతుంది. గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత.. తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే.. కదుళ్లు స్ట్రాంగ్‌గా మారతాయి. గంజిలో ఉండే అమైనో యాసిడ్స్‌.. జుట్టుకు పోషణ అందించి.. సిల్కీగా, స్ట్రాంగ్‌ మారుస్తాయి. 

Cover.Metalnation.org

చలి కాలంలో జుట్టు బిరుసుగా మారుతుంది. మీ జుట్టుకు షైనీ లుక్కు తీసుకురావాలంటే.. కప్పు గంజిలో కాస్త నిమ్మరసం, చెంచా పెరుగు కలిపి హెయిర్‌కు అప్లై చేయండి. గంజిలోని పోషకాలు జుట్టును మెరిపిస్తాయి

Cover.Metalnation.org

బియ్యం కడిగిన నీళ్లలో కాస్త కలబంద గుజ్జు కలిపి తలకు రాసుకుని ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే.. కుదుళ్లు స్ట్రాంగ్‌ అవుతాయి. ఈ నీళ్లో ఉండే అమైనో యాసిడ్స్‌ కురులకు పోషణ అందించి.. మెరిసేలా చేస్తాయి. 

Cover.Metalnation.org

కప్పు గంజి, చెంచా నిమ్మరసం, ఓ గుడ్డులోని తెల్లసొన మిక్స్‌ చేసి తలకు పట్టించండి. ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేస్తే.. కుదుళ్లు స్ట్రాంగ్‌ అవుతాయి.

Cover.Metalnation.org

మీ జుట్టు నిర్జీవంగా మారితే.. గంజి నీళ్లు, కొబ్బరిపాలు సమపాళ్లలో తీసుకుని తలకు అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. 

Cover.Metalnation.org