బలవంతపు మతమార్పిడిని అరికట్టాలి... లేదంటే దేశభద్రతకే ముప్పు: సుప్రీంకోర్టు
By Ramya
November 15, 2022
Cover.Metalnation.org
బలవంతపు మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మత మార్పిడి దేశ భద్రతపై ఇది ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.
Cover.Metalnation.org
బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి వివరాలు కోరింది. దీనిపై వారంలోగా స్పందించి దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Cover.Metalnation.org
బలవంతంగా మతం మార్చడాన్ని నేరంగా పరిగణించాలని ఢిల్లీ బీజేపీ నాయకుడు, లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోరారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని, లేదా భారత శిక్షాస్మృతిలో ఈ నేరాన్ని చేర్చాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు.
Cover.Metalnation.org
ఈ సమస్య దేశమంతా వ్యాపించి ఉందని, ఏదో ఒక ప్రాంతానికి చెందినది కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ సమస్యపై సుప్రీంకోర్టు అత్యవసరంగా జోక్యం చేసుకుని, విచారించాలని కోరారు.
Cover.Metalnation.org
దాంతో న్యాయమూర్తులు ఎంఆర్ షా, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ జరిపింది.
Cover.Metalnation.org
బలవంతపు మత మార్పిడి చాలా తీవ్రమైన సమస్య అని, ఇది అంతిమంగా దేశ భ్రదతతోపాటు పౌరుల మనస్సాక్షి, మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని కోర్టు తెలిపింది.
Cover.Metalnation.org
బలవంతంపు మతమార్పిడులను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని వెల్లడించింది.
Cover.Metalnation.org
బలవంతపు మతమార్పిడుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్రాన్ని కోరింది. మళ్లీ ఈ పిల్‌పై విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
Cover.Metalnation.org