చంద్ర గ్రహణం సమయంలో.. గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి..! 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు డైరెక్ట్‌గా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో విడుదల అయ్యే కిరణాలు.. గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకూడదు. 

Cover.Metalnation.org

గర్భిణీ స్త్రీలు గ్రహణానికి ముందే.. సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణ సమయంలో ఏ ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఆహారం తీసుకోవాలనుకుంటే తులసి ఆకులును ముందుగానే అందులో వేయాలి. 

Cover.Metalnation.org

ఉడికించిన లేదా గోరు వెచ్చని నీటిని తాగాలి. పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు. మంచినీళ్లు తాగకూడదు, ఇంటి పనులు కూడా చేయకపోవడం మంచిది 

Cover.Metalnation.org

గ్రహణం సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయాలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. 

Cover.Metalnation.org

గ్రహణం సమయంలో పిన్నులు, హెయిర్‌ పిన్నులు వంటి మెటల్‌ వస్తువులకు దూరంగా ఉండాలి.

Cover.Metalnation.org

గ్రహణం ప్రారంభమైనప్పుడు, గర్భిణీ స్త్రీ స్నానం చేయకూడదు. గ్రహణ సమయంలో వాకింగ్‌, వ్యాయామం లాంటివి చేయకూడదు. 

Cover.Metalnation.org

గ్రహణం సమయంలో మహిళలు నిద్రపోకూడదని చెబుతారు. గ్రహణానికి ముందు, తర్వాత తప్పకుండా స్నానం చేయాలని అంటున్నారు. ఇలాంటి నమ్మకాలకు సరైన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ గ్రహణం సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు.

Cover.Metalnation.org

గ్రహణం సమయంలో మరి అంతా భయపడాల్సిన పనిలేదు. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి మనసును తేలికగా ఉంచుకోవాలి. సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడమో చేయాలి.

Cover.Metalnation.org