రోజూ స్కిప్పింగ్‌ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.. 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

బీజీ లైఫ్‌ స్టైల్‌, బద్ధకం కారణంగా చాలా మంది వర్కవుట్స్‌ చేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రోజూ చిన్నదో, పెద్దో వ్యాయామం చేయాలని నిపుణుల సూచిస్తూ ఉంటారు. 

Cover.Metalnation.org

మన ఇంట్లోనే ఈజీగా, ఎక్కువ హంగామా లేకుండా చేసే‌ వర్కవుట్స్‌లో స్కిప్పింగ్‌ ఒకటి.  

Cover.Metalnation.org

స్కిప్పింగ్‌ వల్ల ఫిట్‌నెస్‌కే కాదు.. మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

Cover.Metalnation.org

ప్రతి వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. వర్కవుట్స్‌ మనం శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండటానికి హెల్ప్‌ అవుతాయి. వర్కవుట్స్‌ చేస్తే ఫిట్‌గా ఉంటాం, షేప్‌ మేయింటేన్‌ చేయవచ్చు.

Cover.Metalnation.org

అధిక బరువుతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజూ స్కిప్పింగ్‌ చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు. ప్రతిరోజూ ఓ గంటపాటు తాడు ఆట ఆడితే.. 1300 క్యాలరీలు ఖర్చవుతాయి. 

Cover.Metalnation.org

స్కిప్పింగ్‌ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది.మనం జాగ్రత్తగా జంప్‌ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Cover.Metalnation.org

స్కిప్పింగ్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాడు ఆట వల్ల హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది. దీంతో గుండె హెల్తీగా ఉంటుంది. రోజూ స్కిప్పింగ్‌ చేస్తే.. గుండె సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Cover.Metalnation.org

స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగవంతం అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. 

Cover.Metalnation.org

స్కిప్పింగ్‌లో భుజాలు తిప్పుతారు, పాదాలతో ఎగురుతారు. స్కిప్పింగ్‌ వల్ల ఆ భాగాలు స్ట్రాంగ్‌గా మారతాయి, ఈజీగా వంగుతాయ. దీంతో బాడీ ఫ్రెక్సిబిలిటీ పెరుగుతుంది.

Cover.Metalnation.org