పండంటి బిడ్డకి జన్మనిచ్చిన బిపాస బసు.. వారం వ్యవధిలో రెండో హీరోయిన్ డెలివరీ
By Ramya
November 15, 2022
Cover.Metalnation.org
బాలీవుడ్ హీరోయిన్ బిపాస బసు (Bipasha Basu) ఈరోజు పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.
Cover.Metalnation.org
2016లో కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)ని వివాహం చేసుకున్న బిపాస బసు.. ఈ ఏడాది ఆగస్టులో తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసింది.
Cover.Metalnation.org
బేబీ బంప్‌తో ఇటీవల ఆమె ఒక ఫోటో షూట్ కూడా చేసింది. ఆ ఫొటో షూట్‌పై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆమెకి మద్దతుగా నిలిచారు.
Cover.Metalnation.org
ఈరోజు బిపాస బసు పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు చెప్పుకొచ్చారు.
Cover.Metalnation.org
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt ) కూడా గత ఆదివారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాంతో వారం వ్యవధిలోనే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ డెలివరీ అయ్యారు.
Cover.Metalnation.org
ఈ ఏడాది ఏప్రిల్‌లో రణబీర్ కపూర్‌ని అలియా వివాహం చేసుకోగా.. వారికి ఇదే తొలి సంతానం. మరోవైపు పెళ్లి అయిన ఆరేళ్ల తర్వాత బిపాస బసు మొదటి బిడ్డకి జన్మనిచ్చింది.
Cover.Metalnation.org
కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి ‘ఎలోన్’ అనే సినిమాలో బిపాస బసు నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
Cover.Metalnation.org
కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత బిపాస పరిమిత సంఖ్యలో సినిమాలు చేస్తోంది. ఆమె చివరిగా ‘డేంజరస్’, ‘క్వాబూల్ హై 2.0’ అనే వెబ్ సిరీస్‌ల్లో నటించింది.
Cover.Metalnation.org