పుష్ప 2 అప్‌డేట్ కోసం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరసన 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

Pushpa 2 మూవీ అప్‌డేట్ కోసం గత ఏడాది నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన అప్‌డేట్ రాలేదు.

Cover.Metalnation.org

అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప- ది రూల్’ (Pushpa) అప్‌డేట్ ఆలస్యం అవుతోందంటూ అభిమానులు ఈరోజు ఆందోళనకి దిగారు. 

Cover.Metalnation.org

హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ (Geetha Arts Office) ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. 

Cover.Metalnation.org

గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప - ది రైజ్’ ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ అయ్యింది.

Cover.Metalnation.org

పుష్ప-2 పై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ నెల ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభమైందని చెప్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Cover.Metalnation.org

వాస్తవానికి ఈ ఏడాదిలోనే పుష్ప-2 మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాలతో ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తవలేదు.

Cover.Metalnation.org

ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు.. మైత్రీ మూవీ మేకర్స్‌ తీరుని తప్పుబడుతూ కనిపించారు. ఇదే పంథాని కొనసాగిస్తే నెక్ట్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ఫ్యాన్స్ హెచ్చరిస్తూ కనిపించారు.

Cover.Metalnation.org

పుష్ప సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇటీవల జరిగిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పుష్ప మూవీకి ఏకంగా 7 అవార్డులు రావడం గమనార్హం. 

Cover.Metalnation.org

డిసెంబరు 16న అవతార్ -2 సినిమా రిలీజ్ కానుండగా.. ఆ మూవీతో పాటు పుష్ప- 2 గ్లింప్స్‌ని కూడా థియేటర్లలో వేయబోతున్నట్లు సమాచారం.

Cover.Metalnation.org