పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్ 

By Ramya

November 14, 2022

Cover.Metalnation.org

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌భీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) తల్లిదండ్రులయ్యారు. 

Cover.Metalnation.org

వీరిద్దరూ దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. పాన్ ఇండియా మూవీ RRRతో ఆలియా భట్ (Alia Bhatt). అలాగే బ్రహ్మాస్త్ర (Brahmastra) చిత్రంతో రణ్ భీర్ కపూర్ మన ప్రేక్షకులను మెప్పించారు.  

Cover.Metalnation.org

వీరిద్దరూ ప్రేమించి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.  

Cover.Metalnation.org

త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఆదివారం ఆలియా భట్ గిర్‌గాన్‌ (Girgaon)లోని అంబానీకి చెందిన రిలయన్స్ హాస్పిటల్‌ (Reliance Hospital)లో పాపకు జన్మనిచ్చింది. 

Cover.Metalnation.org

ఈ గుడ్ న్యూస్‌తో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషంగా ఉన్నారు. నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా రణ్ భీర్, ఆలియా దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఆలియా భట్.. సినిమా షూటింగ్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్‌లోనూ పాల్గొంది. 

Cover.Metalnation.org

సీనియర్ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ (Mahesh Bhatt) కుమార్తె అయిన ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (student Of the Year) చిత్రంతో నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. 

Cover.Metalnation.org

తర్వాత ఒక వైపు పెర్ఫామెన్స్ పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్‌లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఆలియా భట్. 

Cover.Metalnation.org

NTR 30లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవటం, ప్రెగ్నెన్సీ వంటి కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. 

Cover.Metalnation.org