హీరోయిన్‌కి చేదు అనుభవం.. బండరాయితో కారుపై అభిమాని దాడి 

By Ramya

November 15, 2022

Cover.Metalnation.org

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌ (Raveena Tandon)‌ గతంలో తనకి ఊహించని చేదు అనుభవం ఎదురైనట్లు తాజాగా గుర్తుచేసుకుంది. 

Cover.Metalnation.org

1990 దశకంలో టాప్ హీరోయిన్‌గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రవీనా టాండన్.. 

Cover.Metalnation.org

అప్పట్లో ఓ అభిమాని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. అతని టార్చర్ భరించలేక చివరికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఈ బాలీవుడ్ భామ వెల్లడించింది. 

Cover.Metalnation.org

ఇంటర్వ్యూలో తనకి ఎదురైన చేదు అనుభవం గురించి రవీనా టాండన్‌ మాట్లాడుతూ ‘‘అప్పట్లో నాకు ఓ వీరాభిమాని ఉండేవాడు. 

Cover.Metalnation.org

అతని అభిమానం ఏ స్థాయికి చేరిందంటే? రక్తంతో లేఖలు రాసి పంపేవాడు. నా ఇంటి గేటు బయట గంటలు గంటలు కాపు కాసేవాడు. చివరికి ఆ అభిమానం పతాక స్థాయికి చేరి కొరియర్ ద్వారా నాకు కొన్ని జుగుప్సాకరమైన ఫొటోల్ని పంపాడు. 

Cover.Metalnation.org

ఆ తర్వాత ఓ రోజు నేను, మా ఆయన, పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా.. పెద్ద రాయితో దాడి చేశాడు. చాలా భయమేసింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాను’’ అని ఆమె గుర్తు చేసుకుంది. 

Cover.Metalnation.org

ఇటీవల ఆమె కేజీఎఫ్-2 (KGF 2) సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలవడంతో పాటు రవీనా టాండన్‌‌కి కూడా మంచి పేరుని తీసుకొచ్చింది. 

Cover.Metalnation.org

ప్రస్తుతం ఆమె ‘పట్నా శుక్లా’ మూవీలో ఓ క్యారెక్టర్‌ని చేస్తోంది. ఈ మూవీకి అర్బాజ్ ఖాన్ నిర్మాత. 

Cover.Metalnation.org